దీపం ఉండగానే

 ముందు జాగ్రత్త చాలా అవసరం . చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యం వల్ల తర్వాత తీరిగ్గా బాధ పడవలసి వస్తుంది . ఇలాంటి కొన్ని సందర్భాలు మనకు అప్పుడప్పుడూ ఎదురవుతూ ఉంటాయి .

ట్రావెల్ బస్సులో ఒక వ్యక్తి అమీర్ పేట్ లో ఎక్కాడు . బస్సు కోటి దాకా వచ్చింది . అక్కడ టికెట్లు చెక్ చేసిన బస్సు
కండక్టర్ అతన్ని దిగి పొమ్మన్నాడు . కారణం .. ఆ వ్యక్తి టికెట్ కరెక్ట్ కాదని . అతను తనకు టికెట్ ఇచ్చిన ట్రావెల్ ఏజెంట్ కు ఫోన్ చేద్దామని సెల్ తీశాడు . సెల్ లో బేలన్స్ లేదు . ఇక అతను బస్సులో ఉన్నవారిని సెల్ అడుక్కోవడం మొదలు పెట్టాడు . .. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. ముందు జాగ్రత్తగా ఫోన్ లో మినిమం బేలన్స్ ఉంచుకుంటే ఈ ఇబ్బంది రాదు కదా.

ఇదే విధమైన సమస్య ఫోన్ చార్జింగ్ విషయంలో కొందరు ఎదుర్కొంటారు . ఫోన్ వాడుతూ ఉంటరు కానీ చార్జింగ్ పెట్టరు . తీర చార్జింగ్ అయిపోయే సమయంలో చార్జింగ్ పెడతారు . అదే సమయంలో కరెంటు పోతుంది . ఓ పక్కేమో ఇంపార్టెంట్ కాల్ రావలసి ఉంటుంది .
అప్పుడు ఉంటుంది వారి అవస్థ . ఇంత బాధ పడే బదులు ఎప్పటికప్పుడు చార్జింగ్ పెడుతుంటే సరిపోయేది కదా .


ఇక మరో సంఘటన .. నీళ్ళ విషయంలో ఎదురవ్వచ్చు . పొద్దున మోటార్ వేద్దామని పడుకుంటాం. తీరా పొద్దున లేచి మోటర్ వేద్దామనుకునేసరికి ఒక్కోసారి కరెంట్ పోతుంది . ట్యాంక్ లో చూస్తే నీళ్ళు నిల్ . ఓ పక్క బాత్ రూం అర్జెన్సీ .
మరో వైపు స్నానం చేసి బయటకు పోయే పనుంది . కానీ ఎంతకీ కరెంటు రాదు . ఇక మన పని ఆ బాధ భరిస్తూ గోళ్ళు గిల్లికుంటూ కూర్చోవడమే.

ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొని తాపీగా బాధ పడే కంటే .. కొంచెం ముందుగా జాగ్రత్త తీసుకుని ఎప్పటి పని అప్పుడు చేసుకుని అప్ డేట్ గా ఉండడం మంచిది . అందుకే కదా పెద్దలంటారు ,, దీపం ఉండగానే ఇళ్ళు చక్కబెట్టుకోవాలి .

No comments:

Post a Comment