రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ 1821 మార్చి 19 న జన్మించి 1890 అక్టోబర్ 20 న మరణించాడు .
ఎన్నో రంగాల్లో విశేష కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి రిచర్డ్ బర్టన్ , ఇతను రచయిత , అనువాదకుడు , సైనికుడు , బాషాశాస్త్రవేత్త, హిప్నాటిస్ట్ , నిరంతర పథికుడు , అన్వేషి,
ఆసియా , ఆఫ్రికా దేశాల్లో ఇతను చేసిన సాహస ప్రయాణాలు బర్టన్ ను ఒక విశిష్ట వ్యక్తిగా నిలిపాయి , బర్టన్ ఇరవై తొమ్మిది ఆసియా , ఆఫ్రికా భాషలను ధారాళంగా మాట్లాడేవాడంటే ఆశ్చర్యపోకుండా ఉండలేం .
బర్టన్ ప్రపంచ ప్రసిద్ది గాంచిన ' అరేబియన్ నైట్స్ ' ను , భారతీయ ' కామసుత్రం ' ను ఆంగ్లం లోకి అనువదించి ప్రపంచ సాహిత్య చరిత్రలో ధృవతారలా నిలిచిపోయాడు ,
జాన్ స్వీక్ తో కలసి బర్టన్ నైలు నదీ జన్మ స్థానాన్ని శోధించడానికి చేసిన ప్రయత్నంలో ఆఫ్రికాలోని అనేక గొప్ప సరస్సులను కనిపెట్టి ప్రపంచానికి తెలియచేశాడు ,
తన అనుభవాలకు అక్షర రూపం ఇస్తూ ఎన్నో పుస్తకాలను రాశాడు బర్టన్ ,
ఎంతో కాలం ఇండియాలోని ఈస్ట్ ఇండియా కంపెనీ లో కెప్టన్ గా పనిచేసిన బర్టన్ తదనంతర కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం లో గౌరవనీయ పదవుల్లో పనిచేశాడు ,
1886 లో రాయల్ గియోగ్రాఫికల్ సొసైటీ చేత ' నైట్ హుడ్ ' బిరుదాన్ని అందుకున్న బర్టన్ బ్రిటిష్ ప్రభుత్వం చేత ' సర్ ' బిరుదునూ పొందాడు .
కొందరి చేత ' హీరో ' గాను , కొందరి చేత ' నీచుడు ' గాను పేరు తెచ్చుకున్న బర్టన్ జీవితం ఆద్యంతం వివాదాలమయం .
బర్టన్ బ్రిటన్ జాతీయుడు . సంపన్న కుటుంబంలో జన్మించాడు . అతని తండ్రి బ్రిటిష్ ఆర్మీలో పెద్ద ఆఫీసర్,
చిన్నతనంలో బర్టన్ ఫామిలీ రకరకాల ప్రదేశాల మద్య తిరుగుతూ నివసిస్తుండేది , అదే బర్టన్ లో తిరుగుబోతు మనస్తత్వాన్ని వృద్ది చేసింది ,
బర్టన్ ఆక్స్ ఫర్డ్ , ట్రినిటీ కాలేజ్ లో విద్యాభ్యాసం చేశాడు ,
ఈస్ట్ ఇండియా సైనికుడిగా ఇండియా లో ఉన్న సమయంలో బర్టన్ బ్రాహ్మణ వేషధారణలో హిందూ సంస్కృతి ని అధ్యయనం చేశాడు , గుజరాతీ, మరాఠీ , హిందీ భాషలను నేర్చుకున్నాడు , భారతీయ సంస్కృతి పట్ల బర్టన్ కి ఎంతో ఆసక్తి ఉండేది , అది చూసి అతని సహ సైనికులు ఎన్నో రకాలుగా బర్టన్ ను విమర్శించేవారు,
బర్టన్ కు శృంగార విషయాల మీద ఆపేక్ష ఎక్కువ, అతను జీవితాంతం రకరకాల శృంగార సంస్కృతులను పరిశోధించాడు , శృంగార శాస్త్రాల్లో చెప్పిన అనేక పద్దతుల మీద స్త్రీలతో కలసి ప్రయోగాలు చేశాడు కూడా.
బర్టన్ 1850 లో గోవా సంస్కృతి మీద ' గోవా అండ్ బ్లూ మౌంటెన్స్ ' అనే తన మొదటి పుస్తకం రాశాడు . బర్టన్ లోని సాహస ప్రియత్వం 1851 లో అతన్ని మక్కా యాత్ర కు ప్రోత్సహించింది , ఎన్నో కష్టాలతో సాగిన మక్కా యాత్ర బర్టన్ ను మొదటి సారిగా ప్రముఖ వ్యక్తిని చేసింది. ఆ ప్రయాణ వివరాలను బర్టన్ ' ది పిలిగ్రిమేజ్ టు ఆల్ మదీన అండ్ మక్కా ' అనే పుస్తకం లో వివరించాడు .
1861 జనవరిలో రిచర్డ్ బర్టన్ ఇసబెల్ అరుండల్ ను నలభై ఏళ్ళ వయసులో వివాహం చేసుకున్నాడు .అంతకు ముందునుంచే వారిద్దరికీ మధ్య సాన్నిహిత్యం కొనసాగుతూ ఉంది .
బర్టన్ కు శృంగార సాహిత్యం పరిశోధించడమన్నా , రాయడమన్నా ఎంతో ఇష్టం .అయితే ఆ రోజుల్లో శృంగార సాహిత్యం ప్రచురించిన వారిని జైళ్ళలో పెట్టేవారు . అందుకే బర్టన్ , అతని మిత్రుడు ఫారెస్టర్ అర్బత్ నాట్ తో కలిసి ' కామశాస్త్ర సొసైటీ ' అనే దాన్ని స్థాపించి ఆ సొసైటీ మెంబర్స్ కోసమంటూ కామశాస్త్ర సాహిత్యాన్ని ప్రచురించారు.
బర్టన్ రాసిన పుస్తకాలన్నిటి లోనూ గొప్ప పేరు తెచ్చి పెట్టింది అతను అనువదించిన ' కామసూత్ర ' . వాత్సాయనుడు రెండు వేల యేళ్ళకు ముందు రాసిన ప్రాచీన సంస్కృత గ్రంథం ' కామసుత్రం ' ను ' వాత్సాయన కామసూత్ర ' పేరు తో 1883 లో బర్టన్ ఆంగ్లం లో అనువదించాడు .అది ' కామసూత్ర ' పేరు తో ప్రపంచ ప్రఖ్యాతి చెందింది . నిజానికి భారత ఋషి వాత్సాయనుని కామసుత్రాల గొప్పతనం ఆ గ్రంథం తోనే ప్రపంచానికి తెలిసింది .ఆనాటి నుంచీ ఈనాటి దాకా ' కామసుత్ర ' మీద ఎన్నో అనువాదాలు , అనుసరణలు ప్రపంచం మొత్తం మీద ప్రచురించబడ్డాయి . అన్నిసార్లు ప్రచురింపబడ్డ సాహిత్య గ్రంథం ప్రపంచం లోనే మరొకటి లేదు . ' కామసూత్ర ' అనువాదంలో బర్టన్ కు అర్బత్ నాట్ సహకారం అందించాడు .
1885 లో ప్రచురింపబడ్డ అరేబియన్ శృంగార సాహిత్యానికి అనువాదం ' థౌజండ్ నైట్స్ అండ్ అ నైట్ ' , అరేబియన్ నైట్స్ పేరుతో బర్టన్ పేరు నిలిచిపోయేలా చేసింది .
బర్టన్ 1886 లో ' ది పెర్ ఫ్యూండ్ గార్డెన్ ' పేరుతో మరో అరబిక్ శృంగార సాహిత్యాన్ని అనువదించాడు .
1890 అక్టోబర్ 19 న బర్టన్ హార్ట్ అటాక్ తో మరణించాడు , అతని భార్య ఆ మనో వ్యధతో బర్టన్ అముద్రిత రాత కాగితాలను ఎన్నితినో తగులపెట్టేసింది ,
ప్రపంచ శృంగార సాహిత్యానికి బర్టన్ చేసిన సేవ సామాన్యమైనది కాదు , ఎన్నో కట్టుబాట్లు ఉన్న నాటి సమాజంలో ధైర్యంగా తన గ్రంథాల ద్వారా శృంగారానికి అక్షర రూపం ఇచ్చాడు బర్టన్ , నాటి ప్రపంచం లో శృంగార చైతన్యాన్ని తేవడానికి ప్రయత్నించాడు .
అతని యాత్రా గ్రంథాలలో ఎంతో వివరంగా తను తిరిగిన వివిధ రకాల సమాజాల శృంగార సంస్కృతిని వర్ణించాడు , భారతీయ కామ శాస్త్ర గొప్పతనాన్ని పాశ్చాత్య ప్రపంచానికి తొలి సారిగా తెలియజేసిన రిచర్డ్ బర్టన్ భారతీయుల మనసుల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాడు ,
No comments:
Post a Comment