ఏదైనా ఒక సమస్య ఎదురయినపుడు దిగులుగా అనిపిస్తుంది .డిప్రెషన్ లోకి వెళతాం.
' మనకే ఎందుకు ఈ సమస్య వచ్చింది .?' అనుకుంటాం . ' ఇంకొన్ని రోజులు ఆగి ఈ సమస్య వచ్చినా బాగుండు ' అనిపిస్తుంది . అయితే మనమెన్ని అనుకున్నా వచ్చిన సమస్య తీరుతుందా!
మనం డిప్రెషన్ లోకి వెళితే మరింత బాధిస్తుంది .
జీవితం గురించి అర్థం చేసుకున్న వాడు సమస్యకు భయపడడు . పారిపోడు .
జీవితంలో సుఖమున్నట్లే కష్టముంటుంది .
పెద్ద సుఖాలు ఉన్నట్లే పెద్ద కష్టాలు వస్తాయి.
అది జీవితం స్వభావం.
దాన్ని గురించి చింతించి ఎం లాభం .
కష్టాన్ని కూడా సహజంగా స్వీకరించి గుండెధైర్యం తో ఎదుర్కోవాలి . పోరాడాలి . గెలవాలి .
అది ఒక్కసారిగా రాదు . దాన్ని అలవాటు చేసుకోవాలి .
ఏ కష్టమైనా ఎల్లకాలం ఉండదు .
అంతిమ విజయం మనదే .
ఒక్క మృత్యువు మాత్రమే మనలను ఓడించగలిగేది .
అయినా మృత్యువు మనలను కమ్ముకుంటున్న వేళ మనం సంతోషించాలి . ఎందుకంటే .. కష్టాల నష్టాల సమస్యల వలయం అయిన ఈ జీవితం నుంచి శాశ్వతంగా విముక్తి దొరుకుతున్నందుకు .
No comments:
Post a Comment