1. వెల్లుల్లి :
* యాంటీ ఫంగస్ , యాంటీ బాక్టీరియా , యాంటీ వైరస్ గా పనిచేసే ' ఎలాసిన్ ' పుష్కలం గా ఉంటుంది.* రోజూ వెల్లుల్లి తీసుకుంటే కాలేయం పరిశుభ్రం అవుతుంది.
* వెల్లుల్లికి తెల్ల రక్త కణాలను అధికంగా ఉత్పత్తి చేసే శక్తి ఉంది కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* ఫ్రూట్ జూస్ లో వేసుకుని తాగవచ్చు.
* ఉదయాన్నే రెండు వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా శనగలతో కలిపి తినడం రుచికరం. ఆరోగ్యకరం.
2. అల్లం :
* జ్వరాన్ని నివారిస్తుంది. * జీర్ణశక్తిని పెంచుతుంది.
* అల్లం టీ , అల్లం మురబ్బా, శొంఠి టీ , శొంఠి పాలు చాలా మంచివి.
* అల్లం , మెంతులు , తేనె కలిపి మరిగించిన నీటిని త్రాగడం చాలా మంచిది.
* ఇందులో ఉండే ఓల్టైల్ నూనె శరీరం లో వేడిని పెంచి , హానికర పదార్థాలను చెమట రూపం లో బయటకు పంపిస్తుంది.
3. తేనె :
* యాంటీ బయాటిక్ . * యాంటీ సెప్టిక్.
* రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
* ఆస్తమా, అలర్జీని తగ్గిస్తుంది.
* ఖనిజ లవణాలు , విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి సీజనల్ వ్యాధులను నివారిస్తాయి.
* ఉదయాన్నే రెండు చెంచాల తేనె , నాలుగు చెంచాల నిమ్మరసం గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం చాలా మంచిది.
* పాలు ,చపాతి ,బ్రెడ్ లాంటివాటిని తేనెతో కలిపి తినవచ్చు.
No comments:
Post a Comment