* పెరుగు జీర్ణమండలానికి మంచి టానిక్ వంటిది. తేలికగా జీర్ణమవుతుంది.
* గోరు వెచ్చని పాలలో ఒక చుక్క పెరుగు వేస్తే ఆ పాలు కొన్ని గంటలలో పెరుగుగా మారిపోతాయి.
* పెరుగు మంచి పోషకాహారం.
* పెరుగులో ఉండే మాసిడోమిల్లస్ , బిఫిడస్ .. శరీరానికి మేలుచేసే బాక్టీరియాను వృద్ది చేస్తాయి.
ఈ బాక్టీరియా శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలను శరీరంలోనుంచి బయటకు పోనివ్వకుండా రక్తం లోకి పంపుతాయి.
* పెరుగు జీర్ణమండలంలో ఉండే హానికారక బాక్టీరియాను నాశనం చేస్తుంది.
* పెరుగు కంటే మజ్జిగ మరింత శ్రేష్టం .
* పెరుగు లేదా మజ్జిగలో ఉండే విటమిన్ కె రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
* మలబద్దకం , అజీర్ణం , విరేచనాలకు ఎక్కువగా తీసుకునే పెరుగు లేదా మజ్జిగ మంచి మందు.
* అపెండిసైటిస్, డయేరియా, డిసెంట్రీ వంటి వ్యాధులకు కారకమయ్యే బాక్టీరియాను పెరుగు లేదా మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ నాశనం చేస్తుంది. ఆ వ్యాధులను తగ్గించడంలో ఉపయోగకారి.
* వయసు పెరగడం వలన కలిగే శరీరక్షీణతను అరికడుతుంది.
* పైల్స్ కు మంచిమందు.
* విరేచనం అయినపుడు మలద్వారంలో మంట కలుగుతుంటే నిమ్మరసం కలిపిన పెరుగు వాడడం వలన తగ్గుతుంది.
* నిద్ర పట్టక బాధపడేవారికి రాత్రివేళలో పెరుగు తీసుకోవడం వలన నిద్ర వస్తుంది.
* సోరియాసిస్ , కొన్ని చర్మవ్యాధులు , కొన్ని రకాల గడ్డలు ఉన్నపుడు పెరుగులో ముంచిన పలుచని , మెత్తని వస్త్రాన్ని కొన్ని గంటల పాటు ఉంచుతూ ఉంటే ఆ చర్మవ్యాధులు తగ్గుతాయి.
గడ్డలు తగ్గుతాయి. లేదా పగిలి చీము బయటకు వచ్చి తగ్గిపోతాయి.
* పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి రోజూ పదిహేను నిమిషాల పాటు ముఖానికి రాసుకోవడం వలన ముఖం మృదువుగా ,కాంతివంతంగా మారుతుంది.
* పెరుగు లేదా మజ్జిగ సర్వకాలాల్లోనూ తప్పక తీసుకోవలసిన ఆహారం మరియు ఔషధం.
Subscribe to:
Post Comments (Atom)
మనలో నేడు పలువురు పురుషులకు "ప్రాస్ట్రేట్"ఒక ప్రధాన సమస్యాగ ఉంటోంది .ఈ వ్యాధికి అల్లోపతి కన్నా పెరుగోపతి [కర్దోపతి]అంత్యంత సులభం/తేలికా/ఉపద్రవాలను కల్గిన్చనటువంటి వైద్యం.ఎలా?పరగడుపున పెరుగుపైన ఏర్పడే పల్చని,నీరు వంటి దానిని ౩నెలలపాటు క్రమం తప్పక సేవించండి చాలు ,జన్మలో ఆ వ్యాధి మీ దరికి రానేరాదు సుమండీ--చల్లా.జయదేవ్-చెన్నై-౧౭
ReplyDelete