ఫోటోగ్రఫీ - వెలుగునీడల సమ్మేళనం .

ఈ సృష్టిలో మనకు కనపడే ప్రతిదీ వెలుగునీడల సయ్యాటే.

ఒక వస్తువును మనం ఎలా చూడగలుగుతున్నాం ! 

ఆరుబయట ఒక చెట్టు ఉంది.దానిని మనం సూర్యుడి వెలుగో , చంద్రుడి వెలుగో  ఉన్నపుడు మాత్రమే చూడగలం. ఇందులో ఉన్న కిటుకు ఏమిటి ?

ఒక వస్తువు కనిపించాలంటే ప్రధానంగా మూడు ఉండాలి.  ఒక లైట్ సోర్స్ , వస్తువు , చూడగలిగేందుకు కన్ను .
సూర్యుడు ప్రైమరీ లైట్ సోర్స్. స్వయం ప్రకాశకం .తనంతట తనే వెలుగును ప్రసాదించే ఒక మండే అగ్నిగోళం. 
సూర్యుడి నుంచి వెలువడే వెలుగు చెట్టు మీద పడుతుంది. తన మీద పడ్డ కిరణాలను  చెట్టు ప్రతిఫలించేట్లు  చేస్తుంది. రెఫ్లెక్ట్ అయిన ఆ కిరణాలు అన్ని దిక్కులకూ వెదజల్లబడుతాయి. ఏదో ఒక దిక్కున ఉన్న మన కంటిలోకి ఆ కిరణాలు ప్రవేశిస్తాయి. కంటి లోని లెన్సు రెటీన అంబడే కంటి లోని తెర మీదకు కేంద్రీకృతం చేస్తుంది.కేంద్రికృతం అయిన అ కిరణాలు తమ మూలం అయిన చెట్టు ఆకారాన్ని ఏర్పరుస్తాయి. దాన్ని మెదడు గ్రహించి మనకు దృష్టిజ్ఞానం ప్రసాదిస్తుంది. దానివల్ల మనం చెట్టును చూడగలుగుతున్నాం .

సరే .. ఫోటోగ్రఫీ ఎలా ప్రారంభమైంది ..

ఫోటోస్ ,గ్రాఫోస్ అన్న పదాలు కలిసి ఫోటోగ్రఫీ గా మారాయి .ఫోటోస్ అంటే కాంతి . గ్రాఫోస్ అంటే గీయడం .ఫోటోగ్రఫీ అంటే కాంతితో గీయడం.

 కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక ఇంట్లో ఒక వ్యక్తి పడుకుని ఉన్నాడు. అది మధ్యాహ్నం.  యధాలాపంగా చూసిన ఆ వ్యక్తికి గోడమీద ఒక నల్లని రూపం కనిపించింది. అది ఒక నీడ. చిన్నగా , తలక్రిందులుగా ఉన్న ఒక చెట్టు రూపం అది. ఈ రూపం గోడ మీద ఎలా ఏర్పడింది అని ఆలోచించాడు ఆ వ్యక్తి.

తలుపు వేసి ఉంది. లేచి వెళ్ళి  తలుపు తీశాడు .ఇప్పుడు చూస్తే గోడమీద ఆ రూపం లేదు .మళ్ళీ తలుపు వేశాడు. ఇప్పుడు చెట్టు రూపం ఉంది . బయట చూస్తే అచ్చం అలాంటి చెట్టే ఒకటీ కనిపిస్తూఉంది.
బాగా ఆలోచించగా ఆ వ్యక్తికి అర్థమైన సంగతి ఇది. ..

సూర్యుడి వెలుగు చెట్టు మీద పడింది. ప్రతిఫలనం చెందిన సూర్యుని కిరణాలు చీకటిగా ఉన్న గదిలోకి , వేసిఉన్న తలుపుకున్న చిన్న కిటీకీకి ఉన్న చిన్న సందు ద్వారా ప్రవేశించాయి.  లోపల ఉన్న తెల్లని గోడ మీద ఆ కిరణాలు కేంద్రీకృతమయ్యాయి .అది కూడా చిన్నగా ,తలక్రిందులుగా ..   ఇదే ఫోటోగ్రఫీ మూలసూత్రం .

మొదటిసారిగా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాడు , ప్రయోగాలు చేసిన వాడు లియోనార్డొ డ విన్సి .

ఫోటోగ్రఫీలో .. చీకటిగది స్థానంలో వెలుగు ప్రవేశించలేని ,చీకటిగా  ఉన్న కెమెరా ఉంటుంది . తలుపుకున్న సందు స్థానంలో లెన్సు ఉంటుంది . తెల్లటి గోడ స్థానంలో ఫిలిం ప్లేన్ ఉంటుంది . అందులో రా ఫిలిం ఉంచుతారు . చెట్టుస్థానంలో  నటీనటులు ఉంటారు . వారిమీద పడేలా లైట్లు ఉంచుతారు .. సూర్యుడి స్థానంలో .

పైన చెప్పుకున్న ఫోటోగ్రఫీ సూత్రం అప్లై అయి ఫిలిం మీద ఆ నటీనటుల బొమ్మలు చిన్నవిగా , తలక్రిందులుగా ఏర్పడుతాయి. ఆ ఫిలిం ను రసాయనాలతో డెవెలప్ చేయడం వలన , ప్రాసెస్ చేయడం వలన .. అందులోని బొమ్మలు ఫిలిం మీద నిలిచిపోతాయి . ఆ ఫిలిం లను ప్రింట్ వేయడం వలన అందులోని బొబొమ్మలు రివర్స్ గా అవుతాయి . అనగా చివరకు .. ప్రింట్ మీద నిలువుగా ఉన్న నటీనటుల  ప్రతిరూపాలు ఏర్పడుతాయి. ..ఇదే ఫోటోగ్రఫీ .

1 comment: