ఆయుష్షు వేదం ఆయుర్వేదం.

"ఆయుః వేదః ఆయుర్వేదః"
ఆయుష్షును పరిరక్షించే వేదమే ఆయుర్వేదం .
దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో వేదాలు ఉధ్భవించాయి.
వేదాలు సమస్త విజ్ఞానానికి భాండాగారాలు.
వేదాలలో ఆయుర్వేదం ఒక భాగం.
ప్రారంభంలో మహర్షులు ఆయుర్వేదాన్ని సామాన్య ప్రజల అనారోగ్యాలకు చికిత్సలో వాడారు.
దానితో పాటు అర్హులైన శిష్యులను చూసి మహర్షులు వారికి ఆయుర్వేద విద్యను నేర్పడం ప్రారంభించారు.
భారతదేశం లోని నాటి గురుశిష్య పరంపర చాలా గొప్పది.
గురువు అన్ని విధాల శిష్యుడిని పరీక్షించి మాత్రమే విద్యాదానం చేసేవాడు.
మంచి గుణగణాలు , మంచితనము, చెడు ఆలోచనలకు దూరంగా ఉండడము, వినయము, సమస్త ప్రాణుల  మీద సహృద్భావము ,కష్టాల్లో ఉన్నవారి పట్ల జాలి, శాస్త్రం నేర్చుకోవాలనే ఉత్సాహము , గ్రహించగల మేధస్సు, కార్యనిర్వహణలో సమర్థత .. ఇలాంటి లక్షణాలు ఉన్నవారినే పరీక్షించి మరీ వైద్య విద్యను నేర్పేవారు  నాటి మహర్షులు.
అలా గురుశిష్యపరంపరగా ఆయుర్వేదం భారతదేశంలో తరం నుండి  తరానికి అందసాగింది. అభివృద్ధి చెందసాగింది. ప్రజల ఆరోగ్యానికి  రక్షగా మారింది.
ఆయుర్వేదం ఎంతో ఉత్కృష్టమైంది.
ఆయుర్వేదం సమస్యకు మూలం ఏమిటో గ్రహించాలని ప్రయత్నిస్తుంది. ఆ మూలకారణం మీద దాడి చేస్తుంది.
సమస్యకు మూలమే సమసి పోతే ఇక సమస్య లేదు.రాదు.
రోగం వస్తే ఏం చేయాలో చెప్పే శాస్త్రమే కాదు ఆయుర్వేదం,అసలు అనారోగ్యమే రాకుండా ఎలా జీవించాలో చెప్పే ఒక ఆరోగ్యకరమైన జీవనమార్గమే ఆయుర్వేదం.
ఆయుర్వేదం మానవుడ్ని కేవలం శరీరం గానే చూడదు. ఆత్మ , మనసు, శరీరాల కలయికగా చూస్తుంది.
అందువల్లే ఆయుర్వేదం పరిపూర్ణ వైద్య విధానం గా మారింది.
ఆయుర్వేదం శరీరానికి కొన్ని నియమాలను , మనసుకు కొన్ని నియమాలను ఉపదేశించింది.  వాటినే స్వస్థవృత్తం అని, సద్వృత్తం అనీ అంటారు.
ఆయుర్వేదంలో శల్య చికిత్స , ఔషధ చికిత్స వేరువేరుగా అభివృద్ది చెందాయి.
శల్యచికిత్సకు ఆద్యుడు సుశృతుడు.( సర్జన్  )
ఔషద చికిత్సలో ప్రముఖుడు చరకుడు.( ఫిజీషియన్  )
ఆయుర్వేదంలో వేదాల్లాంటి ప్రధాన గ్రంధాలు మూడున్నాయి.
వాటిని  ' బృహత్ త్రయీ  ' అంటారు.
అవి..
చరకసం హిత...దాదాపు క్రీస్తుపూర్వం 2000 సం. లో రాయబడింది.
సుశృతసం హిత   ..క్రీ.పూ. 1000 సం. లో రాయబడింది.
అష్టాంగసంగ్రహం ..క్రీ.శ. 600 సం. లో రాయబడింది.

1 comment:

  1. {దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో వేదాలు ఉధ్భవించాయి}

    Just 4000 years ago? But, I read vedas as undated, please check.

    ReplyDelete